Ramu Rathod Elimination: అమ్మ యాదిలో ఎలిమినేట్ అయిన రాము రాథోడ్.. ఎమోషనల్ జర్నీ!
on Nov 9, 2025

తిన్నా తీరం పడతలే.. కూసున్నా తీరం పడతలే.. భాదైతుందో యాదిలో మనసంతా.. అమ్మ యాదిలో మనసంతా అంటూ బిగ్ బాస్ హౌస్ లో రాము రాథోడ్ పాడిన పాట అందరి గుండెల్ని హత్తుకుంది. బిగ్ బాస్ హౌస్ లో గత తొమ్మిది వారాలుగా తన ఆటతీరుతో ఆకట్టుకున్న రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు.
అమ్మ యాదికొస్తుందంటు రాము రాథోడ్ పాడగానే.. ఒంటరిగా అనిపిస్తుందా? నీకంటూ ఎవరూ లేరా? హౌస్‌లో చాలామంది ఉన్నారు కదా రామూ అని నాగార్జున అన్నాడు. ఉన్నారు సర్ ఉన్నారు.. కానీ, మా ఫ్యామిలీ గుర్తొస్తుంది. మాది పెద్ద ఫ్యామిలీ.. నేను లేకుండా వాళ్లు ఎలా ఉంటారో అని బాగా బెంగగా ఉందని రాము అన్నాడు.
వాళ్లంతా నువ్వు ఈ హౌస్‌లో ఉండాలని కోరుకుంటున్నారేమో.. అంత పెద్ద ఫ్యామిలీకి నువ్వు హీరోవి రామూ. వాళ్ల హీరో ఇలా ఉంటే నచ్చుతుందా.. హీరోస్ ఎప్పుడూ ఆట అంతు చూస్తారు.. అంతే కానీ ఇలా గివప్ ఇవ్వరు. నిలబడు, కలబడు. నామినేషన్స్‌లో ఉన్నాననే భయం ఏమైనా ఉందా అని నాగార్జున అడిగాడు. అదేం లేదు సర్.. నేను వెళ్దానని డిసైడ్ అయ్యానని రాము అన్నాడు.

అంటే ఏంటి.. ఇప్పుడు వెళ్లిపోతావా.. సరే నిర్ణయం నీకే వదిలేస్తున్నా.. ఆలోచించుకుని చెప్పు.. నీకు పది సెకన్లు మాత్రమే టైమ్ ఇస్తున్నా.. వెళ్తానంటే గేట్లు ఓపెన్ అవుతాయని నాగార్జున అన్నాడు. పది సెకన్ల తరువాత కూడా వెళ్తాననే రాము అన్నాడు.
అఆ అనే పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నావా.. మా నాన్న గారు ఆ పుస్తకంలో తన ఫీలింగ్స్ అన్నీ రాశారు. మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఒక ఆర్ట్ ఫామ్ వెతుక్కుంటాం. నీకు పాట పాడటం తెలుసు.. డాన్స్ చేయడం తెలుసు.. కంపోజ్ చేయడం తెలుసు.. ఇంకేం కావాలి నీకు.. ఇంతమంది హౌస్‌లో ఉన్నారు. నీ ఫైనల్ నిర్ణయం ఏంటో చెప్పమని నాగార్జున అడిగాడు. భయంగా ఉంది అని రాము అన్నాడు. భయం వదిలేస్తేనే గెలుపు నీ దరి చేరుతుందని నాగార్జున అన్నాడు.
హౌస్‌లో ఉన్న వాళ్లలో రాము వెళ్లిపోతేనే హ్యాపీగా ఉంటాడు అన్నవాళ్లు చేయి ఎత్తండి అని నాగార్జున అడుగగా.. తనూజ, రీతూ, కళ్యాణ్, సంజనా, దివ్యలు చేతులు ఎత్తేశారు. వాడు ఇక్కడ ఉండలేకపోతున్నాడు సర్.. ఒంటరిగానే ఉంటున్నాడు.. రాత్రి నిద్రపోవడం లేదని చెప్పింది రీతూ.
చూడు రామూ.. నువ్వేం భయపడకు.. నిన్ను హౌస్‌లో బలవంతంగా ఉంచాలని మాకెవరికీ లేదు. నీకు ఉండాలనిపిస్తే ఉండు.. నువ్వు ఉండాలని ఆడియన్స్ నిన్ను ప్రేమించి ఓట్లేస్తున్నారు. నువ్వు సమాధానం చెప్పాల్సింది వాళ్లకి మాత్రమే.. మాకు కాదు. అందుకే నిన్ను ఇంతసేపు అడుగుతున్నామని నాగార్జున అన్నాడు. ఇక ఉండనని చెప్పేశాడు రాము రాథోడ్. దాంతో నాగార్జున మెయిన్ డోర్ నుండి బయటకు వచ్చేశెయ్ అని చెప్పాడు. కాసేపటికి అందరికి బై చెప్పేసి నాగార్జున దగ్గరకి వచ్చేశాడు రాము రాథోడ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



