Bigg Boss 9 Telugu: ఆ కండిషన్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఆర్జీవి..!
on Nov 9, 2025

బిగ్ బాస్ సీజన్-9 తొమ్మిదో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరిగాయి. ఇందులో ముఖ్యంగా తనూజ క్రైయింగ్ హైలైట్ అవ్వగా, సుమన్ శెట్టి, దివ్య ఆటతీరు అదుర్స్ అనిపించింది. ఇక నామినేషన్లో ఉన్నవాళ్ళలో శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరు సేవ్ అయ్యారో చూసేద్దాం.
నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా నాగార్జున 'శివ' గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ‘వాయిదా పద్ధతుంది దేనికైనా’ అంటూ నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసింది అమల. 36 ఏళ్ల క్రితం ‘శివ’ సినిమాతో అలరించిన నాగార్జున, అమలలు మళ్లీ ఇప్పుడు ఇలా బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించి కనువిందు చేశారు. 36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాం.. ఇప్పుడు మళ్లీ ఈ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నామంటూ ఆడియన్స్‌లో ఉత్సాహం నింపారు.

ఆ తర్వాత ‘శివ’ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే రాము రాథోడ్ గాలి తీసేశారు ఆర్జీవీ. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సర్' అంటే.. స్టుపిడ్ క్వశ్చన్ అని అనేశాడు. రాములోని రాము బయటకు వచ్చారంటూ నాగార్జున సెటైర్ వేసి కాస్త కూల్ చేశాడు. ఇక లాస్ట్ పంచ్ అయితే మామూలుగా లేదు. నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజులు ఉంచితే ఉంటావా అని నాగార్జున అడిగారు. అందరూ సంజన లాంటి అమ్మాయిలు ఉంటే ఉంటానని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఆ టైమ్‌లో సంజన మొహం చూడాలబ్బా.. ఆనందో బ్రహ్మా అంతే. ఇక తనూజ, రీతూ మొహాలు వాడిపోయాయి. ఇక శివ సినిమా గురించి కంటెస్టెంట్స్ నాగార్జున, ఆర్జీవీని క్వశ్చన్స్ అడుగగా కూల్ గా సమాధనమిచ్చారు.
ఇక హౌస్ లో నామినేషన్లో ఉన్నవారిని నిల్చోమని చెప్పాడు. అందులో ఒకరిని ఆర్జీవి ముందు సేవ్ చేద్దామని అన్నాడు. నామినేషన్లో ఉన్నవారిలో నుండి కళ్యాణ్ సేవ్ అయ్యాడు. హౌస్ మేట్స్ కి ఫ్యామిలీ నుండి కొన్ని వాయిస్ మెసేజ్ లు, షర్ట్స్, ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. అయితే అవి దక్కించుకోవాలంటే హౌస్ లోని మిగతా వారు కొన్ని త్యాగం చేయాలంటూ కండిషన్ పెట్టాడు నాగార్జున.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



