పటాస్ హౌస్ లో నా కొత్త ప్రాజెక్ట్ ప్రోమో షూటింగ్ మొదలయ్యింది!
on Dec 10, 2022
మంజుల నిరుపమ్ ..బుల్లితెర మీద సీరియల్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు రియల్ వైఫ్ మంజుల. మంజుల కన్నడంలో మనయందు మూరుబాగిలు, ప్రేమ పిశాచిగలు, క్షణ-క్షణ, కాదంబరి, తులసి, కల్యాణి, రంగోలి వంటి సీరియల్స్ లో ఇక తెలుగులో చంద్రముఖి, అమ్మాయి కాపురం, చంద్రలేఖ, నీలాంబరి, ఇద్దరమ్మాయిలు, ఆకాశమంత, కాంచనగంగ, తరంగాలు, లేతమనసులు వంటి సీరియల్స్ లో హీరోయిన్ పాత్రల్లో చేసింది.
ఇక మంజుల సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా జెమినీ టీవీలో తన కొత్త సీరియల్ షూటింగ్ ప్రారంభమయ్యింది చెప్పుకొచ్చింది. అది కూడా సీరియల్ ప్రోమో షూటింగ్ అట..జెమినీ ఛానల్ వాళ్ళు చేస్తున్నారని చెప్పింది. ఐతే జెమినీకి సంబంధించిన వాళ్ళు అంతగా ఎవరూ తెలియదని చెప్పింది. ఇక ఇంటి నుంచి లంచ్ బాక్స్ ని, కావాల్సిన కాస్ట్యూమ్స్ ని, మేకప్ కిట్ ని అలాగే మినీ ఫ్యాన్ ని మొత్తాన్ని ఎలా ప్యాక్ చేసుకుని షూటింగ్ లొకేషన్ కి తీసుకెళ్ళిందో చూపించింది. ఇక ఫస్ట్ డే షూటింగ్ ప్రోమో పటాస్ హౌస్ లో జరిగిందని చెప్పింది. అంటే పటాస్ మూవీని ఆ ఇంట్లోనే షూట్ చేశారట. అలాగే కార్తీకదీపం సీరియల్ లో ఫస్ట్ లో చూపించిన ఇల్లు అని కూడా చెప్పింది మంజుల.
ఇక ఫుల్ మేకప్ వేసుకుని రెడీ అయ్యింది..ఐతే తన మేకప్, డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో రేటింగ్ ఇవ్వండి అని తన ఫాన్స్ ని కోరింది మంజుల. ఇక నెటిజన్స్ అందరూ పదికి పది మార్కులు వేసి కొత్త ప్రాజెక్ట్ సందర్భంగా బెస్ట్ విషెస్ కూడా చెప్పారు.
Also Read