పీరియడ్ పెయిన్ అనుభవించడానికి నేను సిద్ధం: జగపతి బాబు
on Nov 9, 2025

పీరియడ్ పెయిన్ అబ్బాయిలకు ఒక్కసారి ఇలా వచ్చి అలా పొతే బాగుండు అంటూ రష్మిక తన మనసులోని కోరికను జయమ్ము నిశ్చయమ్మురా షోలో చెప్పుకొచ్చింది.
"పీరియడ్ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేను. స్కాన్స్ చేయించాను, బ్లడ్ టెస్ట్ లు చేయించాను కానీ ఆ నొప్పి తగ్గదు. ఆ టైములో ఎందుకు ఎలా బిహేవ్ చేస్తామో తెలీదు. ప్రతీ నెలా ఈ నొప్పి ఎందుకు దేవుడా అనుకుంటూ ఉంటాను. అందుకే అబ్బాయిలకు అది ఎక్ష్ప్లైన్ చేయలేము కాబట్టి ఒక్కసారన్నా ఆ పెయిన్ భరిస్తే చాలు" అని చెప్పింది.
దానికి జగపతి బాబు "నేను నీ మాటలతో ఏకీభవిస్తాను అంతే కాదు నేను ఆ పీరియడ్ పెయిన్ ని భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు యాక్టింగ్ పర్ఫెక్ట్ గా చేయాలి, అందంగా కనిపించాలి, నవ్వాలి, నీ నొప్పి ఎవరికీ తెలీకుండా పెర్ఫార్మ్ చేయాలి" అంటూ చెప్పారు జగపతి బాబు.
దాని మీద ఒక ఇన్సిడెంట్ ని చెప్పింది రష్మిక. "పుష్ప మూవీ జాతర సీక్వెన్స్ చాలా లాంగ్ పీరియడ్ లో జరిగింది. సాంగ్ ముందు నేను పుష్పతో మాట్లాడే ఒక పోర్షన్ షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ లో నాకు విపరీతమైన కడుపు నొప్పి. నేను నిల్చోలేకపోయాను. ఇలా కడుపు నొప్పి వచ్చింది అని వెళ్లి టీమ్ తో చెప్పడం ప్రొఫెషనల్ గా ఉండదు. అదే టైములో వర్షంలో, మంచులో డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రీమ్ వెథర్స్ లో షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తుంది. ఐతే నాకు అదే టైంలో పాదం దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది. ఒక కాలికి లిగమెంట్ గాయం అయ్యింది, అలాగే ఇంకో కాలి పాదంలో ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యింది. ఐతే ఫ్రాక్చర్ ఐనప్పుడు కూడా నేను నవ్వుతూనే ఉన్నాను. నేను ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ కి చెప్పాను. ఐతే వాళ్ళు బెణికి ఉంటుంది పాదంలో ఎముక ఫ్రాక్చర్ ఐతే నువ్వు ఇలా నవ్వుతూ ఉండవు. అంటే నేను ఏదైనా బాధ కలిగినప్పుడు నవ్వుతూ ఉంటాను ఎందుకో మరి తెలీదు నా బుర్రలో ఏదైనా వైర్ ఆఫ్ అయిందేమో" అని ఫన్నీగా చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



