డ్రామా జూనియర్స్ లో నిధి అగర్వాల్...
on Jul 23, 2025

డ్రామా జూనియర్స్ కూడా మూవీ ప్రమోషన్స్ కి అడ్డా ఐపోయింది. ఆల్రెడీ సుమ అడ్డా, సర్కార్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి మూవీ టీమ్స్ వెళ్లి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా డ్రామా జూనియర్స్ షోని కూడా యూజ్ చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ షోకి వచ్చింది. నెక్స్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో "ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అద్భుతాలు రెండే రెండు. ఒకటి చైనా వాల్ రెండోది నిధి అగర్వాల్..నిన్ను కలవడం నా విధి, నీకోసం నా గుండెల్లో ఉందో గది, నిన్ను మించిన అందం ఏది" అంటూ కవిత చెప్పేసరికి నిధి ఫిదా ఐపోయింది. తర్వాత ఇద్దరు బుడతలు వచ్చి నిధిని పొగిడారు. "నిధి పాపే సన్నగా అరనవ్వే నవ్వగా మతితప్పి మతి తప్పి ఆడియన్స్ థియేటర్ కి వెళ్లారే..." అంటూ ఒకడు.. "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాల్లే నిధి చాల్లే" ఇంకో బుడతడు పొగిడాడు.
దాంతో నిధి ఆ ఇద్దరు బుడతలతో పాటు సుధీర్ బుగ్గల్ని పుణికింది. ఇక ఈర్య ఐతే సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడుకుంది. టిఫిన్ బడ్డీ పెట్టుకుని సుధీర్ టిఫిన్ కావాలా అని అడిగి మరీ టీజ్ చేసింది. వేడి వేడిగా ఏముంది అని సుధీర్ అడిగేసరికి "వేడి వేడిగా బయట ఎండ ఉంది" అని చెప్పింది తర్వాత "వేడి వేడిగా ఈ హోటల్ లో ఏముంది" అని అడిగాడు. "వేడిగా పెనం ఉంది తింటావా పార్సిల్ కట్టమంటావా" అని అడిగింది. పుల్లట్లు ఉంటే ఇవ్వు అని సుధీర్ అడిగేసరికి కొన్ని పిల్లలకు అట్లు గుచ్చి ఇచ్చి షాకిచ్చింది ఈర్య. తర్వాత అనిల్ రావిపూడి, రోజా టిఫిన్ చేశారు. "మామ నీది మొత్తం 50 అయ్యింది" కుమారి ఆంటీ స్టైల్ లో చెప్పింది. "మాకు డబ్బులు ఇచ్చే అలవాటు లేదు" అంది రోజా. వెంటనే ఈర్య తన ఫాన్స్ కి చెప్తాను అంటూ బెదిరించింది. ప్రభాస్ మూవీలో బిట్ చూపించి మరీ భయపెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



