పులిహోర కలపడం బాగా వచ్చుగా
on Jul 19, 2025

సీనియర్ హీరోలు హీరోయిన్లు ఈమధ్య బుల్లితెర షోస్ కి బాగా వస్తున్నారు. రీసెంట్ గా జీ తెలుగులో ఆదివారం ప్రసారం కాబోతున్న బ్లాక్ బస్టర్ బోనాలు షోకి హీరో శ్రీకాంత్, హీరోయిన్ రోజా వచ్చారు. ఆ ప్రోమో చూస్తే శ్రీకాంత్ రోజా మీద పంచ్ లు వేస్తూనే ఉన్నాడు. "నా రాజా నువ్వే" అనే సాంగ్ కి రోజా వేసిన డాన్స్ కానీ కన్నుకొట్టి మరీ లవ్ సింబల్ చూపించడం మాములుగా లేదు. "బ్లాక్ బస్టర్ బోనాలు జరుపుకోవాలంటే రోజా గారి టీమే జరుపుకోవాలి" అని హోస్ట్ రవి అనేసరికి "రోజా ఎంటర్ ఐతే వార్ వన్ సైడ్ అవుతుంది" అని చెప్పింది రోజా. తర్వాత హీరో శ్రీకాంత్ మంచి యంగ్ లుక్ లో "సౌందర్య లహరి" సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.
"ఏంటి రోజా గారు వస్తే వార్ వన్ సైడా...ఇప్పుడు నేను ఆఫ్టర్ నూన్ సీరియల్స్ కి సపోర్ట్ చేస్తున్న. నిజంగా వార్ వన్ సైడే..అది నా సైడ్ " అంటూ వాళ్ళ టీమ్ వైపు చూపించాడు. "చిన్నపిల్లలం మేమందరం..సరదాగా బోనాలు పండగ చేసుకోవడానికి వచ్చాము" అని రోజా చెప్పేసరికి. "నువ్వు తలకు రంగు వెయ్యి మాకు వెయ్యకు" అంటూ శ్రీకాంత్ రోజాకి కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఒక మ్యూజిక్ పెట్టి ఆ సాంగ్ చెప్పాలంటే రోజా గారిని కానీ శ్రీకాంత్ గారిని కానీ పట్టుకోవాలని చెప్పాడు హోస్ట్ రవి. తర్వాత ఒక సీరియల్ యాక్టర్ వచ్చి రోజాని పట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ "పాట తెలిసి వచ్చారా రోజా గారిని హగ్ చేసుకోవడానికి వచ్చారా" అంటూ మళ్ళీ కౌంటర్ వేసాడు శ్రీకాంత్. "వానొచ్చేస్తుంటే వరదోచేస్తుంది" అనే సాంగ్ కి రోజా, శ్రీఎకాంత్ కలిసి డ్యూయెట్ డాన్స్ చేసారు. ఇక తర్వాత బాలయ్య అఖండ గెటప్ లో ఒక పిల్లాడు వచ్చి "రోజా నేను నీకే సపోర్ట్ చేస్తా అన్నాడు" . వెంటనే రోజా "వచ్చేయండి మన పార్టీకి" అనేసింది. ఇక బోనాలు స్పెషల్ లో త్రిసూలం మీద కోరిక కోరుకుని గాజులు వేశారు. ఇక శ్రీకాంత్ ఐతే "నువ్వు అనుకో అసెంబ్లీకి వెళ్ళకూడదు అని" అన్నాడు. అంతే రోజా మాత్రం గాజులు వేసింది. దాంతో శ్రీకాంత్ షాకయ్యాడు. ఫైనల్ గా రోజాకి, శ్రీకాంత్ కి కళ్ళకు గంతలు కట్టి పులిహోర కలిపే టాస్క్ ఇచ్చాడు రవి. శ్రీకాంత్ ఐతే చేతికి దొరికిన ఇంగ్రీడియెంట్స్ ని వేసి కలిపేసి కంపు చేసాడు. "నాకు పులిహోరా కలపడం రాదు..రోజాకు పులిహోర కలపడం బాగా వచ్చు" అన్నాడు శ్రీకాంత్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



