మొదటి వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!
on Sep 11, 2025

బిగ్ బాస్ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది . ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరు ఉండగా భరణి సుత్తిని ముందుగా పట్టుకున్నాడు. దాంతో తను సంజనని నామినేట్ చేసి సుత్తిని శ్రీజకి ఇస్తాడు కానీ శ్రీజ సంజనని కాకుండా తనూజని నామినేట్ చేస్తుంది. నువ్వేం చేసిన యాక్టింగ్ చేసినట్లనిపిస్తుందని తనూజతో శ్రీజ అంటుంది. అలా తనూజ గురించి ఓనర్స్ అందరు ఒక్కొక్కరుగా పాయింట్స్ చెప్తారు. ఎవరైన అన్నం పెడుతుంటే అన్నపూర్ణలాగా ఉండాలి.. ఏదో చేస్తేస్తున్న ఇష్టం ఉంటే తినండి అన్నట్లు ఉంటుంది నీ బిహేవియర్ అని హరీష్ అనగానే తనూజ హర్ట్ అవుతుంది. మీ బాడీ లాంగ్వేజ్ బాలేదంటు మాస్క్ మెన్ హరీష్ అన్నాడు.
ఒక అమ్మాయి బిహేవియర్ పై అలా అనడం కరెక్ట్ కాదని తనూజ పక్కకి వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, ఫ్లోరా సైని వంతు రాగ సుమన్ శెట్టి సుత్తి తీసుకుంటాడు. తను మొదటగా సంజనని నామినేట్ చేస్తాడు. సుత్తి తీసుకొని ప్రియకి ఇస్తాడు. ప్రియ రాముని నామినేట్ చేస్తుంది. రెంటర్స్ లో భరణిని మాత్రమే ఎవరు నామినెటే చెయ్యలేదు. దాంతో బిగ్ బాస్ అతనికి ఒక పవర్ ఇస్తాడు. ఓనర్స్ లో సుత్తి తీసుకొని వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు మనీష్ ఇంకొకరు డీమాన్ పవన్ వారిలో ఒకరిని డైరెక్ట్ నామినేషన్ లోకి తీసుకోనే వచ్చే ఛాన్స్ భరణికి వచ్చింది.
డీమాన్ పవన్ ని భరణి డైరెక్ట్ నామినేట్ చేస్తాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక మొత్తం నామినేషన్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సంజన, ఫ్లోరా సెని, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ, రీతూ చౌదరి, శ్రష్టి, ఇమ్మాన్యుయల్, ఓనర్స్ లో డీమాన్ పవన్ ఉన్నాడు. మరి వీరిలో మీ ఓట్ ఎవరికి.. ఎవరిని హౌస్ నుండి బయటకి పంపించాలనుకుంటున్నారు కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



