ఆదిరెడ్డి కామన్ మ్యానా.. ఎలా?
on Dec 2, 2022
బిగ్ బాస్‌లో మొదటిసారిగా కామన్ మ్యాన్‌కి అవకాశం ఇచ్చారు అని చాలా మంది అనడం వింటూనే ఉన్నాం. "ఒక కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు.. రివ్యూయర్ కంటెస్టెంట్ అయ్యాడు.. కంటెస్టెంట్ కంటెండర్ అయ్యాడు.. కంటెండర్ కెప్టెన్ అయ్యాడు" అంటూ ఆదిరెడ్డే చాలా సార్లు హౌస్ లో చెప్పుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తనకి భిన్నంగా ట్రోల్స్ వస్తున్నాయి.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోన్న అంశం "అసలు ఆదిరెడ్డిని కామన్ మ్యాన్ అని ఎలా అంటారు? ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు" అంటూ పలువురు కామెంట్స్ చెయ్యగా.. "ఎంత స్టార్ హీరో అయిన కెరీర్ మొదట్లో కామన్ మ్యాన్ అంటారు. కానీ ఒక హీరో అయ్యాక కూడా కామన్ మ్యాన్ అని చెపితే అది తప్పు అవుతుంది. ఆదిరెడ్డిని సీజన్-5 లోనే పిలిచారు. అప్పుడే సెలబ్రిటీ లిస్ట్ వరకు వెళ్ళాడు. ఇంకా క్రికెట్ ఫాంటసీ చానెల్స్ ప్రెడిక్షన్స్.. చాలా చాలానే ఉన్నాయి. ఒక యూట్యూబ్ రివ్యూయర్. ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఒక్కప్పుడు కామన్ మ్యాన్ అంటే ఓకే కానీ ఇప్పుడు అలా అనడం తప్పు. ఆదిరెడ్డితో కంపేర్ చేస్తే రాజ్, ఇనయా, ఫైమా, ఆఖరికి శ్రీహాన్ కూడా తక్కువే" అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయంపై గీతు రాయల్ కూడా ఆదిరెడ్డికి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. కానీ సోషల్ మీడియాలో "ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు. అలా చెప్పుకోవడం తప్పు" అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
Also Read