సోది రీజన్స్ చెప్పకు.. ఆటిట్యూడ్ చూపించకు.. కీర్తిపై ఆదర్శ్, ఇంద్రజ ఫైర్!
on Nov 9, 2025

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఒక సెగ్మెంట్ లో మాత్రం కీర్తి భట్ కి, ఆదర్శ్ కి మధ్యలో మాటామాటా పెరిగి స్టేజి మీదనే గట్టిగా అరుచుకున్నారు.
ఈ షోలో రష్మీ మూడు వరసలో బుడగలు పెట్టి మూడు జంటలతో పగలగొట్టించేలా చేసింది. ఐతే ఆ మూడు జంటలు ఎవరంటే సిద్ధిపేట మోడల్ - భవాని, నాటీ నరేష్ - ప్రియాంక, ఆదర్శ్ - కీర్తి. అమ్మాయిలను అబ్బాయిలు సెలెక్ట్ చేసుకున్నారు. తరువాత ఒక్కో జంటకు ఒక గోనె సంచి ఇచ్చి అందులో ఇద్దరూ నిలబడి గెంతుకుంటూ వెళ్లి ఆ బుడగలు పగలగొట్టాలి. ఐతే కీర్తి మొదట్లో పడిపోబోయింది. వెంటనే ఆదర్శ్ పట్టుకున్నాడు. దాంతో వాళ్ళు ఓడిపోయారు.
వెంటనే ఆది వచ్చి "ఆదర్శ్ అన్నా నువ్వు ఎప్పుడూ గేమ్ లో ముందుంటావ్" అన్నాడు. "నేను సోలోగా ఐతే గెలిచేవాడినేమో తను మధ్యలోనే పడిపోయింది నేను చెప్తూనే ఉన్నాను. కోఆర్డినేషన్ లేక. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఫస్ట్ నేను తర్వాత నువ్వు అని. మధ్యలో మిస్ చేసి తర్వాత పడిపోయాను అంటున్నావ్ " అన్నాడు ఆదర్శ్. "కాలు బయటకు వచ్చేసింది అందుకే ఆడలేకపోయా" అని కీర్తి చెప్తే "ఆ రీజన్స్ అన్ని ఎందుకు ఎవరు గెలిచారు" అంటూ ఆదర్శ్ రెట్టించాడు. దానికి కీర్తి ఐతే ఒక్కరే ఆడాల్సింది మరి అంది. ఇలా అంటే ఎవరన్నా గెలుస్తారా అని ఆదర్శ్ కూడా అడిగాడు. "పక్కనున్న మనుషుల గురించి ఆలోచించాలి గేమ్ తర్వాతన్నా ఆడుకోవచ్చు" అంది కీర్తి. "కెమిస్ట్రీతో ఆడితే గెలుస్తాము రీజన్స్ చెప్తే అంతే" అన్నాడు.

దానికి రష్మీ కూడా "ఇలాంటి ఒక గేమ్ కి కోఆర్డినేషన్ అవసరం. సరే ఆదర్శ్ హర్ట్ అవ్వకు" అంది. "ఎప్పుడు గేమ్ పెట్టినా గెలుస్తాను ఇప్పుడు ఎవరి వలన ఓడిపోయాను. అది చెప్తే ఏదేదో సోది రీజన్స్ అన్నీ చెప్తది" అనేసరికి రష్మీ షాకయ్యింది. వెంటనే కీర్తి వచ్చి "నన్ను అడగకుండా నా పేరు చెప్పావ్ అనేసరికి.. రాకుండా ఉండాల్సింది అన్నాడు. రాను అంటే ఈ అమ్మాయికి పొగరు అంటారు అంది కీర్తి. ఇప్పుడు అదే కనిపిస్తోంది అన్నాడు ఆదర్శ్. మనుషులు ఏమైనా పర్లేదు అంటే కుదరదు అని కీర్తి అనేసరికి నేను గేమ్ గెలవాలనే వస్తాను అని గట్టిగా చెప్పాడు.
వెంటనే ఇంద్రజ "కాదు కీర్తి సారీ ఆదర్శ్ అని చెప్తే సరిపోయేది కానీ అలా కాకుండా నేను చేయలేదు అని ఆటిట్యూడ్ చూపించావుగా అది రెచ్చగొట్టేటట్టు ఉంది" అని చెప్పింది. "అమ్మాయిలేందుకు మేడం ఎప్పుడూ తగ్గాలి" అని అడిగింది కీర్తి. "మీరు ఎంతున్నా చెప్పండి ఏదో ఒక రీజన్స్ చెప్తుంది వేస్ట్" అనేశాడు ఆదర్శ్. "సరే ఇది జస్ట్ గేమ్ దీని వలన మీ ఫ్రెండ్ షిప్ పాడవకూడదు ఇక వదిలేయండి" అంది ఇంద్రజ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



