ENGLISH | TELUGU  
Home  » TV News

అనసూయని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో..! ఊహ‌ల్లో హైప‌ర్ ఆది!!

on May 10, 2021

 

బుల్లితెరపై ప్రసారమయ్యే 'జబర్దస్త్' షోలో యాంకర్ అనసూయ-హైపర్ ఆది జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. అనసూయపై రొమాంటిక్ పంచ్ లు వేస్తూ.. ప్రేక్షకులను నవ్విస్తుంటాడు హైపర్ ఆది. 'జబర్దస్త్' వేదికపై వీరిద్దరి రొమాంటిక్ ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ లో అనసూయతో కలిసి రొమాంటిక్ డాన్స్ లు వేస్తూ బుల్లితెరను షేక్ చేసిన‌ హైపర్ ఆది ఇప్పుడు అదే అనసూయను ఉద్దేశించి పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు. హైపర్ ఆది పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబుల్ మీనింగ్ డైలాగులకు రొమాన్స్ జోడించి దూసుకుపోతుంటాడు. 

ఈ క్రమంలో తాజాగా విడుదలైన 'జబర్దస్త్' ప్రోమోలో యాంకర్ అనసూయను ఉద్దేశిస్తూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో అంటూ తన కోరికను బయటపెట్టాడు. మే 13న ప్రసారం కాబోయే 'జబర్దస్త్' ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 

ఇందులో హైపర్ ఆది, శాంతి స్వరూప్ లు ఓ స్కిట్ చేశారు. హైపర్ ఆది భార్యగా శాంతి స్వ‌రూప్‌, మరదలిగా అనసూయ స్టేజ్ పైకి వచ్చారు. అనసూయను చూస్తూ.. 'ఏంటి మీ చెల్లి తల ఎత్తదా..?' అని హైపర్ ఆది.. శాంతి స్వరూప్ ని అడుగుతాడు. దానికి అనసూయ 'మా నాన్నగారు ఎత్తొద్దన్నారు' అని చెప్తుంది. 

ఆ తరువాత 'మా చెల్లి చపాతీలా ఉంటుంది' అని శాంతి స్వరూప్ చెప్పగా.. 'ఆవిడ చపాతీలా ఉంటే.. నువ్వు చపాతీ కర్రతో కొట్టినట్లు ఉంటావు' అంటూ పంచ్ వేసేశాడు ఆది. దీంతో వెంటనే అనసూయ రియాక్ట్ అవుతూ 'మా అక్క పరువు తీయొద్దు. తను నాకు ఎన్నో ఇచ్చింది.. తను చదువు మానేసి నాకు పలకిచ్చి పంపింది' అంటూ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పింది. దీంతో హైపర్ ఆది వెంటనే 'అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకిచ్చి చేసినా బాగుండేది' అనేశాడు. అన‌సూయ స‌హా అంద‌రూ ఒక్క‌సారి షాకై, ఆ త‌ర్వాత ఆది పంచ్‌కు నవ్వేశారు. ఈ ప్రోమో తెగ వైర‌ల్ అవుతోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.