యాంకర్ రవికి నాగార్జున క్లాస్ పీకుతారా?
on Sep 25, 2021
వీకెండ్ వచ్చేసింది. నేడు 'బిగ్ బాస్'కి కింగ్ అక్కినేని నాగార్జున వస్తారు. కంటెస్టెంట్లలో ఈ వారం ఎవరు ఏం చేసిందీ ఆధారాలతో సహా చూపిస్తారు. గొడవలు జరిగితే తప్పు ఎవరిది అనే విషయంలో కళ్ళకు కట్టునట్టు చూపిస్తారు. గత వారం సిరి హనుమంతు తన షర్టులో సన్నీ చెయ్యి పెట్టాడని గోల గోల చేసింది. చెయ్యి పెట్టింది సన్నీ కాదని నాగార్జున క్లియర్ కట్ విజువల్స్ చూపించారు.
'బిగ్ బాస్'లో ఈ వారం గొడవ విషయానికి వస్తే... నామినేషన్స్ ప్రక్రియలో లహరి వేరే మగాళ్లతో బిజీగా ఉంటుందని ప్రియా అన్నది. మిడ్ నైట్ రవిని హగ్ చేసుకోవడం చూశానని చెప్పింది. అప్పుడు ఆమె మీద లహరితో పాటు రవి కూడా ఫైర్ అయ్యాడు. కట్ చేస్తే... 'బిగ్ బాస్' నుండి బయకు వెళ్లిన తర్వాత లహరి యాంకరింగ్ కోసం ప్రయత్నిస్తోందని, అందుకనే తన పనులు చేస్తున్నదని, ఇక్కడ ఇంతమంది సింగిల్ మెన్ ఉండగా తన చుట్టూ తిరుగుతుండటంతో తాను చెప్పలేకపోతున్నాని ప్రియాతో రవి అన్నాడు. అదే విషయం లహరి ప్రియా చెప్పింది. వెంటనే రవి దగ్గరకు వెళ్లిన లహరి, నేరుగా క్వశ్చన్ చేసింది.
ప్రియా అన్నట్టుగా తాను ఏమీ అనలేదని రవి బుకాయించాడు. 'నువ్వు అన్నావ్ బ్రో' అని ప్రియా వెక్కి వెక్కి ఏడ్చింది. రవి మాట్లాడిన విషయాన్ని ఇంట్లో మిగతా కంటెస్టెంట్లకు నాగార్జున నేడు చూపించే అవకాశం ఉంది. అలాగే, రవికి క్లాస్ పీకుతారని టాక్. ఏం అవుతుందో చూడాలి.