కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బిగ్ బాస్ షూటింగ్లో పాల్గొన్న కమల్ హాసన్!
on Dec 7, 2021
కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు కమల్ హాసన్ నుండి వివరణ కోరాలని తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ యోచిస్తోంది. నవంబర్ 22న కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేరిన కమల్ శనివారం (డిసెంబర్ 4) డిశ్చార్జ్ అయ్యారు. అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన నేరుగా తను హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5 సెట్స్‌కు వెళ్లి షూటింగ్లో పాల్గొన్నారు.
Also read: బిగ్‌బాస్ : ఇంతకీ 13 వారాలకు పింకీకి ఎంత దక్కింది?
ఇప్పుడు, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి నేరుగా తన షూటింగ్‌కు వెళ్లాలనే కమల్ నిర్ణయంపై తమిళనాడు ఆరోగ్య శాఖ వివరణ కోరనుంది. ప్రభుత్వ సేఫ్టీ రెగ్యులేషన్ ప్రకారం కొవిడ్ నుంచి కోలుకున్నవారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది.
Also read: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ బిగ్ బాస్ హోస్ట్‌గా తిరిగొచ్చారు!
"కరోనా పాజిటివ్‌గా తేలినవారు హాస్పిటల్లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందిన తర్వాత, ఇంట్లో ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో గడపాలి. కానీ హాస్పిటల్లో కోలుకున్న తర్వాత, కమల్ ఏడు రోజుల పాటు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండలేదు. దానికి బదులుగా ఆయన బిగ్ బాస్ షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్లారు. అందువల్ల తన చర్యపై వివరణ కోరుతూ ఆయనకు ఆరోగ్యశాఖ నోటీసు పంపుతోంది" అని తమిళనాడు హెల్త్ సెక్రటరీ డాక్టర్ జె. రాధాకృష్ణన్ చెప్పారు.
కమల్ హాస్పిటల్లో ఉండగా, ఆయన స్థానంలో ఒక వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్‌కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
