కోటి రూపాయలు ఇచ్చినా బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్ళను...
on Oct 3, 2025

షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్ళాడు. ఇక హౌస్ లో షణ్ముఖ్ జశ్వంత్ కలిపిన పులిహోర మాములుగా లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఒక ప్రశ్న అడిగారు. "బిగ్ బాస్ లోకి మళ్ళీ పిలిస్తే వెళ్తారా" అని. అప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ ఇలా చెప్పాడు. "కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని కొన్ని పనులు చేయను అందులో బిగ్ బాస్ కి అవకాశం వచ్చినా వెళ్ళను. లేదు అస్సలు వెళ్ళను. మొదటిసారి నన్ను వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నేను బిగ్ బాస్ కి రాను అనే చెప్పాను. దాదాపు 7 మీటింగ్స్ అయ్యాయి వాళ్ళు చాలా కన్విన్స్ చేశారు. బిగ్ బాస్ తర్వాత నాతోనే సినిమా అని కూడా అన్నారు. ఇక సినిమా అనే మాట వినేసరికి నేను వెళ్లాలనుకున్నాను. లేకపోతె వెళ్ళేవాడిని కాను.
ఎందుకంటే నేను ఆ షోకి పర్ఫెక్ట్ కాదు అన్న విషయం నాకు తెలుసు. నేను ఎంటర్టైనర్ ని కాను. యాక్షన్, కట్ అంతే నాకు తెలుసు. ఇంకో సారి బిగ్ బాస్ అవకాశం వస్తే నేను వెళ్ళను. ఆ షో ఇంట్రావర్ట్స్ కి, యాక్టర్స్ కి కాదు. ఆ షో కంటిన్యుయస్ గా ఎంటర్టైన్ చేసేవాళ్లకు మాత్రమే. హౌస్ లో అన్ని రోజులూ ఎంటర్టైన్ చేయడం ఎవరూ చేయలేరు కూడా." అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఎదురయ్యింది. "బిగ్ బాస్ వరమా, శాపమా" అని అడిగారు. "బిగ్ బాస్ కి వెళ్లడమే రాంగ్ స్టెప్. అది నాకు వరమూ కాదు అలాగని శాపం అని చెప్పి నేను చేసినదాన్ని వేరే వాళ్ళ మీదకు తోసేయలేను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చూస్తే అక్కడ నా కోసం కాదు మిగతా వాళ్ళ కోసం గొడవ పడి రెచ్చిపోయాను. నాగ్ సర్ ని నేను ఎంత ఇష్టమో వీకెండ్స్ లో కనిపించేది. ఆయనతోనే నేను కొంచెం ఫన్నీగా ఉండేవాడిని. నేను బిగ్ బాస్ కి వెళ్లడం రిగ్రెట్ లా ఫీల్ కావట్లేదు దాని నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. బిగ్ బాస్ కి ముందు నాకు ఏమీ తెలీదు. కానీ అక్కడికి వెళ్లొచ్చాక నన్ను నేను ఎలా ట్యూన్ చేసుకోవాలో తెలిసింది." అని బిగ్ బాస్ గురించి షణ్ముఖ్ జశ్వంత్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



