ప్రియకు నాగ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడా?
on Oct 21, 2021
'బిగ్ బాస్ 5' హౌస్లో ఎవరైనా తప్పు చేస్తే... వీకెండ్ కింగ్ నాగార్జున క్లాస్ పీకడం ఖాయం. ఒకవేళ క్లాస్ పీకుతున్న టైమ్లో తాము అలా చేయలేదని ఎవరైనా చెబితే... వీడియో ప్రూఫ్ చూపించి మరీ క్లాస్ కంటిన్యూ చేస్తున్నారు. మరి... నాగార్జునకు, 'బిగ్ బాస్'కు ప్రియ చేస్తున్నవి కనిపించడం లేదా? అనేది షోను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్లకు కలిగే సందేహం.
'బిగ్ బాస్ 5' మొదలైన రెండు మూడు వారాలకు ప్రియ, సన్నీ మధ్య గొడవలు మొదలయ్యాయి. కయ్యానికి కాలు దువ్వింది ఎవరనేది తెలియకపోయినా నివురు గప్పిన నిప్పులా ఇద్దరి మధ్య అడపా దడపా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఒకసారి నాగార్జున సైతం ప్రతి చిన్న విషయానికి సన్నీ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడని చెప్పారు. ప్రియను మాత్రం ఏమీ అనలేదు. ఈసారి ఏమైనా అంటారో, లేదో? చూడాలి.
ప్రియ, సన్నీ మధ్య ఈవారం కూడా గొడవ జరిగింది. కోడిగుడ్ల టాస్క్ లో సన్నీ బుట్టలో గుడ్లను ప్రియ కొట్టేయడంతో గొడవ మొదలైంది. సన్నీ పరోక్షంగా డే విషయాన్ని ప్రస్తావిస్తే... 'బారాబర్ కొట్టేస్తా' అని ఆన్సర్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా గడ్డిపోచతో సన్నీని పోల్చింది. పైగా, గాల్లోకి గడ్డిపోచను ఊది... సన్నీ గడ్డిపోచతో సమానం అన్నట్టు ప్రవర్తించింది. దీనిపై నాగార్జున, 'బిగ్ బాస్' ఏమీ అనకపోతే... ప్రియకు వాళ్లిద్దరూ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని అనుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
