నాకు నచ్చింది నేను చేస్తున్నానని దానికి కారణం ఆయన..మంచి భర్తే కాదు, మంచి తండ్రి కూడా!
on Nov 28, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం రకరకాల కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం "భాగ్యలక్ష్మి బంపర్ డ్రా" పేరుతో ఫుల్ నవ్వించేసింది. ఈ ఎపిసోడ్ లో ఒక వెరైటీ టాస్క్ కూడా ఇచ్చింది రష్మీ. స్టేజి మీద కొన్ని జ్యూస్ గ్లాసెస్ పెట్టి అందులో గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్ వేసింది. ఆ జ్యూస్ తాగిన వారికి ఫైనల్ లో గోల్డ్ కాయిన్ వస్తే "సారీ" చెప్పాలని, సిల్వర్ కాయిన్ వస్తే "థ్యాంక్యూ" చెప్పాలనే టాస్క్ ఇచ్చింది.
ఫస్ట్ ఇంద్రజ స్టేజి మీదకు వచ్చి ఒక గ్లాస్ జ్యూస్ తాగింది. అందులో సిల్వర్ కాయిన్ వచ్చేసరికి నేను ఈరోజు ఎవరికీ థ్యాంక్యూ చెప్పాలి అనుకుంటున్నానంటే " మా ఆయనకు థ్యాంక్యూ చెప్పాలి. నువ్వు 14 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావ్. అంత చిన్న వయసు నుంచి నీ సంపాదనతో ఫామిలీని రన్ చేసావ్..ఇప్పుడు నువ్వు అది మిస్ అవుతున్నావ్ అనుకుంటున్నాను..నువ్ ఏం చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి..నేను నీ పక్కన ఉంటాను..అన్నారు ఆ మాటకు చాలా థ్యాంక్స్. మా అమ్మాయి సారా ఎల్కేజీ నుంచి ఇప్పటివరకు మొదటి, చివరి గురువు ఎవరు అంటే మా ఆయనే.
నేను చాలామంది పేరెంట్స్ ని చూసాను వాళ్ళ పిల్లలు ఏ క్లాస్ అంటే చెప్పగలరు కానీ సెక్షన్ అంటే చెప్పలేరు. అలాంటి వాళ్ళ మధ్య ఈయన ఓన్లీ వన్ గుడ్ ఫాదర్ అని చెప్పగలను. ఆయన ఒక గొప్ప తండ్రి. నా పక్కన నువ్వుంటే నేను ఏదైనా చేయగలను..." అని ఈ స్టేజి ద్వారా ఇంద్రజ తన హజ్బెండ్ గురించి చెప్పింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
