రోడ్డు ప్రమాదానికి గురైన బిగ్ బాస్ కంటెస్టెంట్ స్పృహలోకి వచ్చింది!
on Jul 28, 2021
.jpg)
నటి, బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్ యషికా ఆనంద్ జూలై 25 వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతూ, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. ఆమె ఆరోగ్య స్థితి గురించి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ప్రమాదానికి గురైన సమయంలో కారును యషిక స్వయంగా నడుపుతున్నట్లు వెల్లడైంది. కంట్రోల్ తప్పిన కారు రైలింగ్‌ను ఢీకొట్టి, రోడ్డుపక్కనే ఉన్న గుంతలోకి పల్టీకొట్టింది. ఆ ప్రమాదంలో యషిక స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన వల్లిచెట్టి భవాని స్పాట్‌లోనే మృతి చెందగా, యషిక, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి, చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదివరకు, యషిక ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నదనీ, పలు చోట్ల ఎముకలు విరగడంతో కొద్ది రోజుల్లో ఆమెకు శస్త్రచికిత్సలు జరగనున్నాయనీ ఆమె సోదరి ఓషీన్ ఆనంద్ చెప్పింది. తాజాగా ఆమె ఇచ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది. యషిక స్పృహలోకి వచ్చిందనీ, విరిగిన ఎముకలకు సర్జరీలు జరుగుతున్నాయనీ ఆమె వెల్లడించింది. "మీ ప్రార్థనలకు రుణపడి ఉంటాం. రానున్న కొద్ది రోజులు ఆమెకు క్రిటికల్ కాబట్టి తను కోలుకోవాలని ప్రార్థనలు చేస్తుంటారని ఆశిస్తున్నాం." అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రాసుకొచ్చింది.
ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవింగ్ చేస్తున్నందువల్ల యషికపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. వాటిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ఒకరి మరణానికి కారణమైందనే అభియోగం కూడా ఒకటి. దీనికి ఐపీసీ 304 ఎ సెక్షన్ కింద కేసు పెట్టారు. ఇప్పటికే ఆమె డ్రైవింగ్ లైసెన్సును స్వాధీనం చేసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



