విజయ్ దర్శకత్వంలో 'బిచ్చగాడు 2'.. ప్రకటించిన మురుగదాస్
on Jul 24, 2021
విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం 'బిచ్చగాడు'. 2016లో ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'బిచ్చగాడు 2' రూపొందనుంది. విజయ్ ఆంటోని ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్.. ఆ తరువాత నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలతో మెప్పిస్తున్నాడు. సంగీత దర్శకుడిగా, నటుడిగా, ఎడిటర్ గా ఇలా తన మల్టీ టాలెంట్ తో ఆకట్టుకున్న విజయ్.. తొలిసారి మెగాఫోన్ పడుతున్నాడు. నిజానికి 'బిచ్చగాడు2' ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో రూపొందనున్నట్లు గతేడాది ప్రకటించారు. అయితే ఇప్పుడు విజయ్ నే దర్శకత్వ భాధ్యత్యలు నిర్వర్తించబోతున్నాడు. నేడు(జూలై24) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ 'బిచ్చగాడు 2' పోస్టర్ను విడుదల చేశాడు. కాళీమాత ఉంగ్రరూపంతో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
తొలి భాగాన్ని తెరకెక్కించిన 'విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్' సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మించనుంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ సినిమా 2022లో విడుదల కానుంది.
Also Read