విజయ్, పూజా హెగ్డే సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్?
on Jun 18, 2021
`మాస్టర్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత కోలీవుడ్ స్టార్ విజయ్ మరో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. `కోలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కి ముస్తాబవుతోంది.
ఇదిలా ఉంటే.. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు కోలీవుడ్ బజ్. అంతేకాదు.. ఈ సినిమాకి `టార్గెట్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని వినికిడి. కథానుసారం ఈ చిత్రానికి ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని నెల్సన్ అండ్ టీమ్ భావిస్తోందట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే జూన్ 22 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, ఈ సినిమాకి కోలీవుడ్ యువ సంగీత సంచలనం అనిరుధ్ బాణీలు అందిస్తున్నాడు. `కత్తి`, `మాస్టర్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత విజయ్, అనిరుధ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం.. వారికి హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.