`పుష్ప` ఐటెమ్ సాంగ్.. ఎవరా `సీటీమార్` భామ?
on May 14, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం `పుష్ప` రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీలో నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో దర్శనమివ్వనున్నారు బన్నీ.
ఇదిలా ఉంటే.. `పుష్ప` సెకండ్ పార్ట్ లో సుక్కు శైలిలో సాగే ఓ ఐటమ్ సాంగ్ కి స్కోప్ ఉందట. అందులో `రాధే` బ్యూటీ దిశా పఠాని లేదా `రాధేశ్యామ్` భామ పూజా హెగ్డే నర్తించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే.. బన్నీ చూపు `సీటీమార్` భామల వైపే ఉందని చెప్పొచ్చు. `డీజే`లో `సీటీమార్` అంటూ అల్లు అర్జున్ తో కలిసి పూజా హెగ్డే చిందులతో కనువిందు చేస్తే.. రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన `రాధే`లో రీమిక్స్ వెర్షన్ `సీటీమార్`లో స్టెప్పులతో అదరగొట్టేసింది దిశ. త్వరలోనే `పుష్ప` ఐటమ్ సాంగ్ లో నర్తించనున్న భామ ఎవరన్న విషయంపై క్లారిటీ రానున్నది.
బన్నీతో పూజా హెగ్డే `డీజే`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో నటించగా.. దిశకి ఇదే ఫస్ట్ కాంబినేషన్ మూవీ కానుంది.
కాగా, `పుష్ప`లో రష్మిక మందన్న నాయికగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెకండాఫ్ లో.. సెకండ్ పార్ట్ వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ కానుందని బజ్.
Also Read