`ప్రాజెక్ట్ కె`లో మరో ఇద్దరు హీరోలు?
on Aug 4, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారిగా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `ప్రాజెక్ట్ కె` పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా.. వైజయంతీ మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ దివా దీపికా పడుకోన్ నాయికగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. `ప్రాజెక్ట్ కె`లో కథానుసారం మరో ఇద్దరు హీరోలకు స్థానముందట. కాకపోతే, ఆ కథానాయకులవి ప్రభాస్ కాంబినేషన్ లో కాకుండా అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో వచ్చే రెండేసి సీన్లు ఉన్న పాత్రలని టాక్. ఆ పాత్రల్లో నాని, విజయ్ దేవరకొండ లాంటి టాలీవుడ్ యంగ్ హీరోస్ కానీ లేదా వేరే భాషలకు చెందిన స్టార్స్ కానీ దర్శనమిచ్చే అవకాశముందని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`ప్రాజెక్ట్ కె`కి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. 2023లో ఈ భారీ బడ్జెట్ మూవీ వెండితెరపై వెలుగులు పంచనుంది.