వకీల్గా సూర్య
on May 7, 2021
తన గత చిత్రం `సూరారై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`)తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ సూర్య. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్.. రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒక చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. మరో సినిమాని `కూటత్తిల్ ఒరువన్` (అశోక్ సెల్వన్, ప్రియా ఆనంద్ హీరోహీరోయిన్లు) ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు.
కాగా, టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సూర్య వకీల్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ పాత్రకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాయర్ గా నటించడం సూర్యకిదే మొదటిసారి కావడంతో.. సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. `కర్ణన్` ఫేమ్ రజీషా విజయన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. `గ్యాంగ్ లీడర్`, `శ్రీకారం` చిత్రాల కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో సూర్యకి జంటగా నటిస్తోంది.
మరి.. ఈ రెండు సినిమాలు సూర్యకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.