సెల్వరాఘవన్.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది
on Mar 6, 2021
`7/G బృందావన కాలనీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, `యుగానికి ఒక్కడు` చిత్రాలతో తెలుగువారికి చేరువైన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్. గత కొంతకాలంగా ట్రాక్ తప్పిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. చాన్నాళ్ళ తరువాత ఓ సక్సెస్ ఫుల్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎస్. జె. సూర్య, రెజీనా, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో సెల్వరాఘవన్ రూపొందించిన హారర్ థ్రిల్లర్ `నెంజమ్ మరప్పదిల్లై` నిర్మాణం ఎప్పుడో పూర్తిచేసుకున్నా.. పలు కారణాల వల్ల చాలా ఆలస్యంగా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఊహించని కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడంతో.. సెల్వరాఘవన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. మార్చి 5 సెల్వరాఘవన్ పుట్టినరోజు. సరిగ్గా అదే రోజు వచ్చిన `నెంజమ్ మరప్పదిల్లై` మళ్ళీ అతణ్ణి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావడం విశేషమనే చెప్పాలి.
మొత్తానికి.. సెల్వరాఘవన్ బర్త్ డే గిఫ్ట్ అదిరిందనే చెప్పాలి.
Also Read