బ్లాక్‌లో బోల్డ్ బ్యూటీ రకుల్.. డాన్స్ వీడియో వైరల్
on Jun 24, 2022
రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో కంటే బాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఈమె ఎంతో మంది స్టార్ హీరోస్ సరసన నటించింది. రకుల్ కి ఈ మధ్యకాలంలో తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. కానీ క్రేజ్ మాత్రం అలాగే క్యారీ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ని మూటగట్టుకుంది రకుల్. గోపీచంద్‌తో లౌక్యం, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో ధ్రువ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఒక టైములో మహేష్ బాబు కి డేట్స్ కూడా ఇవ్వలేనంత బిజీగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడినట్లు ప్రకటించింది. బాలీవుడ్ యాక్టర్ ఐన జాకీ ప్రొడ్యూసర్ కూడా.
రకుల్ ఇప్పుడు సోషల్ మీడియాని ఫుల్లుగా వాడేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. లేటెస్ట్గా రకుల్ బ్లాక్ డ్రెస్ తో చేసిన డాన్స్ కి కుర్రకారు మత్తెక్కిపోతున్నారు. ఆమె డాన్స్ కి ఫిదా ఐపోతున్నారు. "భూల్ గయా మజ్ భూరి " అనే ఫేమస్ సాంగ్ కి దుమ్మురేగేలా డాన్స్ చేసింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రకుల్. బ్లాక్ డ్రెస్ లో తన క్లివేజ్ అందాలను చూపిస్తూ చేసిన ఈ డాన్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.
వైష్ణవ్ తేజ్ తో డైరెక్టర్ క్రిష్ తీసిన 'కొండపొలం'లో ఓబులమ్మగా మంచి పేరు తెచ్చుకుంది రకుల్. కానీ ఆ సినిమా ఫ్లాపయ్యింది. అలాగే నితిన్ తో కలిసి యాక్ట్ చేసిన 'చెక్' మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా గ్రాఫ్ మళ్ళీ కిందకి పడిపోయింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లోకి దూసుకెళ్లింది. అక్కడ వరుసగా అజయ్ దేవగన్ తో, ఇంకా ఫేమస్ స్టార్ హీరోస్ తో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది.