లక లక లక 'చంద్రముఖి'కి పదహారేళ్లు!
on Apr 15, 2021
దక్షిణాదిన కామెడీ హారర్ చిత్రాల ట్రెండ్ కు ఊపునిచ్చిన సినిమా 'చంద్రముఖి'. 'పడయప్పా' (తెలుగులో 'నరసింహ`) తరువాత వచ్చిన 'బాబా' తీవ్రస్థాయిలో నిరాశపరిచిన నేపథ్యంలో.. సూపర్ స్టార్ రజినీకాంత్‌ని మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువచ్చి అప్పట్లో వార్తల్లో నిలిచిందీ బ్లాక్ బస్టర్ మూవీ. అంతేకాదు.. ఫిమేల్ సెంట్రిక్ టైటిల్ తో సూపర్ స్టార్ ఈ సినిమాని చేయడం గురించి కూడా అప్పట్లో పలు చర్చలు నడిచాయి.
"లక లక లక.." అంటూ రజినీకాంత్ చేసిన సందడి ఇప్పటికీ ఎన్నో పేరడీ సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుండడం విశేషం. మలయాళ చిత్రం 'మణిచిత్ర తాళు' (1993) ఆధారంగా 'చంద్రముఖి'ని తెరకెక్కించారు.
పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రజినీకాంత్‌కి జంటగా నయనతార నటించగా.. టైటిల్ రోల్లో జ్యోతిక దర్శనమిచ్చింది. జ్యోతిక భర్తగా ప్రభు నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో వడివేలు, మాళవిక, నాజర్, వినీత్, విజయ్ కుమార్, కేఆర్ విజయ, షీలా, సోనూ సూద్ ఆకట్టుకున్నారు.
విద్యాసాగర్ సంగీతంలో "వారాయ్ నాన్ ఉన్నై తేడీ" పాట విశేషాదరణ పొందగా.. మిగిలిన పాటలు కూడా అలరించాయి. తమిళ సంవత్సరాది సందర్భంగా 2005 ఏప్రిల్ 14న విడుదలైన 'చంద్రముఖి'.. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున జనం ముందుకొచ్చి ఘనవిజయం సాధించింది. ఆ సినిమా విడుదలై 16 సంవత్సరాలు పూర్తయ్యాయి.