'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్!
on Jul 30, 2021
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాధే శ్యామ్'. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు మేకర్స్. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు.
2018లోనే అధికారికంగా ప్రకటించిన 'రాధే శ్యామ్' అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా ప్రభావంతో షూటింగ్ డిలే అయింది. అయితే ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తయిందని డైరెక్టర్ తెలిపాడు. దీంతో త్వరలోనే రాధే శ్యామ్ విడుదల అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ మేకర్స్ షాక్ ఇచ్చారు. 'సంక్రాంతి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని 2022 జనవరి 14న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సినిమా కోసం మరో ఐదు నెలలకు పైగా ఎదురుచూడాల్సి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే 2022 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్, రానా నటిస్తోన్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' దిగబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ 'రాధే శ్యామ్' కూడా బరిలో నిలవడంతో ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమనిపిస్తోంది.
Also Read