ఏడాదిలో 150 కోట్లు వదులుకున్న ప్రభాస్
on Jun 23, 2021
బాహుబలితో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. నేషనల్ వైడ్ గా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఆయన ఫాలోయింగ్ ని సొమ్ము చేసుకోవాలని ఎన్నో కంపెనీలు భావించాయి. అయితే ప్రభాస్ అనేక బ్రాండ్ల ఆఫర్స్ వదులుకున్నాడని.. దీంతో ఒక్క ఏడాదిలోనే 150 కోట్ల రూపాయల సంపాదన మిస్ అయినట్టు తెలుస్తోంది.
నేషనల్ వైడ్ గా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని.. ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవాలని కొన్ని అగ్ర వ్యాపార సంస్థలు.. భారీ పారితోషికం ఆఫర్ చేస్తూ ప్రభాస్ ని సంప్రదించాయట. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతోపాటు.. గతంలో తను కమిట్ అయ్యి ఉన్న బ్రాండ్స్.. ప్రేక్షకుల్లో తనకున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చిన బ్రాండ్స్ అన్నింటినీ ఓకే చేయకూడదని నిర్ణయించుకొన్నారట ప్రభాస్. ఆ ఉద్దేశంతో ఆయన కొన్ని ఆఫర్స్ సున్నితంగా తిరస్కరించారని.. దీని వల్ల ఆయన గడిచిన ఏడాది సుమారు రూ.150 కోట్ల ఆదాయం కోల్పోయారని సమాచారం.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓంరౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రానుంది.