డిసెంబర్ 8 నుంచి ప్రభాస్-మారుతి మూవీ రెండో షెడ్యూల్!
on Dec 4, 2022
మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన రాలేదు కానీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్-k' వంటి భారీ సినిమాలలో నటిస్తున్న ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించడం ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని సోషల్ మీడియా వేదికగా గట్టిగా డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభాస్ సైలెంట్ గా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. డిసెంబర్ 8 నుంచి ఈ మూవీ రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుందని సమాచారం.
Also Read