హాట్ హీరోయిన్... అంత వెయిట్ తగ్గింది!
on Oct 20, 2020
చక్కనమ్మ చిక్కినా అందమే అని తెలుగునాట అంటుంటారు. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో హాట్ హీరోయిన్ అనిపించుకున్న పాయల్ రాజ్ పుత్ ను ఇప్పుడు చూస్తే... చిక్కిన అందంగానే ఉందని అభిమానులు
అంటారు. మామూలుగానే పాయల్ సన్నజాజిలా నాజూకుగా ఉంటారు. అటువంటి ఆమె మరింత చిక్కిపోయారు.
గతంలో 63 కేజీల బరువుండే పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ఎంత బరువు ఉన్నారో తెలుసా? 58 కేజీలే! మొత్తం మీద ఆమె ఐదు కిలోలు తగ్గారు. అసలు ఎటువంటి ప్రోగ్రెస్ లేక పోవడం కంటే నిదానంగా
ఎంతోకొంత ఉండడం మంచిదని ఆమె పేర్కొన్నారు. త్వరలో యాబ్స్ కూడా బిల్డ్ చేస్తానని చెప్పారు. ఇంతకీ ఎందుకు బరువు తగ్గాలనుకున్నారో చెప్పలేదు. అరవై మూడు కేజీలు అంటే మరీ బరువు ఏం కాదు కదా!