నవీన్ పోలిశెట్టి హిందీ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది!
on Sep 20, 2019
మొదట చిన్న చిన్న పాత్రలు చేసి, సడన్గా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా దర్శనమిచ్చి, సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి.. హిందీలో మరింత ఘన విజయం సాధించాడు. 'దంగల్' ఫేం నితేష్ తివారి డైరెక్ట్ చేసిన 'చిచ్చోరే' సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో పాటు మరో హీరోగా నవీన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2019లో ప్రస్తుతం టాప్ 10 పొజిషన్లో నిల్చున్నది.
రెండు వారాల్లో ఈ సినిమా రూ. 105 కోట్ల (నెట్)ను వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది. తొలివారంతో పోలిస్తే రెండో వారం వసూళ్లు 42 శాతం తగ్గినప్పటికీ, రూ. 100 కోట్ల వసూళ్లను దాటిపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. 'చిచ్చోరే' మొదటి వారం రూ. 66.84 కోట్లనూ, రెండో వారం రూ. 38.75 కోట్లనూ వసూలు చేయడం విశేషం. రెండో వారం వసూళ్ల పరంగా చూసుకుంటే 2019లో ఇది నాలుగో అత్యధిక వసూళ్లు. ఈ విషయంలో 'చిచ్చోరే' కంటే ముందున్న సినిమాలు.. 'కబీర్ సింగ్', 'ఉరి: ద సర్జికల్ స్ట్రిక్', 'మిషన్ మంగళ్'.
రానున్న రోజుల్లో ఈ సినిమా గనుక రూ. 130 కోట్ల మార్కును చేరుకునేట్లయితే, రణ్వీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన 'గల్లీ బాయ్' 9వ స్థానానికి ఎసరు పెట్టినట్లే!