సెన్సేషనల్ ఎరోటిక్ ఫిల్మ్ '365 డేస్'కు 2 సీక్వెల్స్ వస్తున్నాయి!
on May 16, 2021
ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ సూపర్ సక్సెస్ అయిన పోలిష్ ఎరోటిక్ ఫిల్మ్ '365 డేస్' (2020)కి రెండు సీక్వెల్స్ రాబోతున్నాయి. '365 డేస్' పార్ట్ 2, పార్ట్ 3 ప్రొడక్షన్ వర్క్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు ఓటీటీ దిగ్గజం ప్రకటించింది. ఒరిజినల్లో మాసిమో అనే మాఫియా డాన్, లౌరా అనే సేల్స్ డైరెక్టర్ మధ్య రిలేషన్‌షిప్‌ను చూశాం. తన బాయ్‌ఫ్రెండ్‌తో అనుబంధాన్ని పరిరక్షించుకోవడానికి సిసిలీకి టూర్ నిమిత్తం వెళ్లిన లౌరాను తొలిచూపులోనే మోహించిన మాసిమో కిడ్నాప్ చేస్తాడు.
తనతో ప్రేమలో పడ్డానికి ఆమెకు 365 రోజుల గడువు ఇస్తాడు. అప్పటిదాకా ఆమెపై ఎలాంటి అఘాయిత్యం చేయనని చెప్తాడు. చివరి సీన్లో లౌరాను చంపడానికి మాసిమో ప్రత్యర్థులు ప్రయత్నించడం చూశాం. లారా చనిపోయిందా, లేదా అనే విషయాన్ని డైరెక్టర్ వెల్లడించలేదు. పలు శృంగార సన్నివేశాలతో ఈ సినిమా సంచలనం సృష్టించింది.
'365' డేస్ పార్ట్ 2లో మాసిమో, లౌరా క్యారెక్టర్లు రెండూ ఉంటాయనీ, ఆ ఇద్దరూ కలుసుకున్నాక, ఒక మిస్టీరియస్ మ్యాన్ లౌరా జీవితంలోకి ఎంటరై, ఏ విధంగానైనా ఆమె ప్రేమనూ, నమ్మకాన్నీ పొందాలని ప్రయత్నిస్తాడనీ సమాచారం. ఒరిజినల్ ఫిల్మ్‌కు కేవలం ఓటీటీ హక్కుదారుగా మాత్రమే ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు సీక్వెల్స్ ప్రొడక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతోంది.
ఒరిజినల్లో ప్రధాన పాత్రధారులైన మిషెలీ మోరోన్ (మాసిమో), అన్నా-మరియా సీక్లుక్కా (లౌరా), మగ్దలీనా లాంపర్స్కా, ఓటర్ సారాలిజ్ సీక్వెల్స్‌లోనూ భాగం కానున్నారు. 'నాచో' అనే కొత్త క్యారెక్టర్లో సిమోన్ సుసిన్నా కనిపించనున్నాడు.
విడుదలైన సమయంలో '365 డేస్'ను విమర్శకులు ఏకిపారేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫిల్మ్ 90కి పైగా దేశాల్లో డైలీ టాప్ 10 లిస్ట్‌లో ఉంటూ వచ్చింది. అంతే కాదు, 2020లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాల్లో నాలుగో స్థానం పొందింది.
Also Read