'నర్తనశాల' టికెట్ రేటు ఎంతంటే?
on Oct 20, 2020
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు తెర దేవుడు, ప్రజలు ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలలో 'నర్తనశాల'ది ప్రత్యేక స్థానం. ఆయన తనయుడు బాలకృష్ణకు ఆ సినిమా అంటే ఎంతో ఇష్టం. స్వీయ దర్శకత్వంలో 'నర్తనశాల'ను బాలకృష్ణ ప్రారంభించారు. అందులో 17 నిమిషాల నిడివిగల సన్నివేశాలను విజయదశమి సందర్భంగా ఈ నెల 24న ఎన్.బి.కె థియేటర్, శ్రేయాస్ యాప్ లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
మరి, 'నర్తనశాల' టికెట్ రేటు ఎంతో తెలుసా? ప్రస్తుతానికి టికెట్ ధరను నిర్ణయించలేదు. అయితే... మినిమం యాభై రూపాయలు పెట్టాలని అనుకుంటున్నారు. టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తంలో కొంత బసవతారకం ట్రస్ట్ కు ఇవ్వాలని నందమూరి బాలకృష్ణ అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.