తెలంగాణ కుర్రాడిగా నాని!!
on Jul 28, 2021
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నాని నటించిన 'టక్ జగదీష్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ ను పూర్తి చేసిన నాని.. ప్రస్తుతం 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నాడు. అయితే నాని తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.
నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తారని సమాచారం. ఇందులో నాని తెలంగాణ కుర్రాడిగా కనిపిస్తాడట. దీంతో నాని స్పెషల్ ట్యూటర్ ను పెట్టించుకుని మరీ తెలంగాణ యాసని నేర్చుకుంటున్నాడట. ఇటీవల 'వకీల్ సాబ్' లో పవన్ కళ్యాణ్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అలరించిన సంగతి తెలిసిందే. అలాగే నాగ చైతన్య కూడా తన లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ'లో తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఇప్పుడు నాని కూడా అదే బాటలో నడవనున్నాడని ప్రచారం జరుగుతోంది.
కాగా నాని గతంలో 'కృష్ణార్జున యుద్ధం'లో చిత్తూరు(రాయలసీమ) యాసలో మాట్లాడి అదరగొట్టాడు. మరి ఇప్పుడు తెలంగాణ యాసలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Also Read