విష్ణు.. నీకిదంతా అవసరమా?
on Jul 23, 2021
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వేడి వాతావరణం సృష్టించాయి. రోజూ ఒక కొత్త పలుకు వినబడుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు అందరికంటే ముందు గంట మోగించిన ప్రకాష్ రాజ్, ఆయన ప్యానల్ ప్రస్తుతం మౌనంగా ఉంది. ఆయనకు పోటీగా బరిలో దిగడానికి సిద్ధమైన విష్ణు మంచు ముందు మౌనంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పెదవి విప్పారు.
జైలుకు వెళ్లాల్సిన కొందరు ఇప్పుడు బయట తిరుగుతున్నారంటే అందుకు కారణం ఎవరో వాళ్ళకు తెలుసునని, శ్రుతి మించితే వాళ్ళ పేర్లు బయట పెడతానని పరోక్షంగా కొందరికి హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో పెద్దలు చెబితే ఎన్నికల నుండి తప్పుకుంటానని చెప్పారు.
విష్ణు మంచు 'మా' ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి నందమూరి కళ్యాణ్ రామ్ స్పందన ఏంటి? అంటే... తాను మా ఎన్నికల్లో పోటీచేయడం కల్యాణ్‌రామ్‌కు ఇష్టం లేదని విష్ణు అన్నారు. 'మా' ఎన్నికల గురించి కళ్యాణ్‌రామ్ తో తాను చెప్పానని, 'ఇప్పుడు నీకు ఇదంతా అవసరమా?' అని కళ్యాణ్ రామ్ తనతో అన్నారని విష్ణు మంచు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'మా' ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కనుక అప్పటిలోపు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ, సినిమా సెలబ్రిటీల మధ్య పోరు కావడంతో జనాలకు దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Also Read