నాగ్ కొత్త చిత్రం.. గాలి వార్తలకు చెక్!
on May 17, 2021
ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ అలరిస్తుంటారు సీనియర్ స్టార్ కింగ్ నాగార్జున. రీసెంట్ గా `వైల్డ్ డాగ్`తో ఆకట్టుకున్న నాగ్.. త్వరలో మరో యాక్షన్ థ్రిల్లర్ తో సందడి చేయనున్నారు. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న ఈ సినిమాలో మాజీ `రా` ఏజెంట్ పాత్రలో దర్శనమివ్వనున్నారు ఈ అక్కినేని స్టార్. అతనికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ప్రవీణ్ సత్తారుకి స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజెస్ చేయమని నాగ్ సూచించారని, అందుకు ప్రవీణ్ అంగీకరించలేదని.. అలాగే హైదరాబాద్ - గోవా పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ విషయంలోనూ నాగ్ అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగిపోయిందంటూ కొన్ని మీడియా వర్గాలు కథనాలు ప్రచురించాయి. అదేవిధంగా.. ఈ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టి `బంగార్రాజు`ని అనుకున్నదానికంటే ముందే నాగ్ పట్టాలెక్కించబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే.. నాగ్ - ప్రవీణ్ సత్తారు కాంబో మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చి ఈ గాలి వార్తలకు చెక్ పెట్టింది యూనిట్. జూన్ తొలి వారం నుంచి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది అన్నదే ఆ అప్ డేట్ సారాంశం. మొత్తమ్మీద.. `బంగార్రాజు` కంటే ముందే ప్రవీణ్ సత్తారు మూవీ రావడం ఖాయమన్నమాట.
నాగ్ - ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.