8 ఎపిసోడ్లతో చైతూ హారర్-సిరీస్!
on Jul 27, 2021
యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. హారర్ సిరీస్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నాడట చైతూ.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ రూపొందించనున్న ఈ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయట. అంతేకాదు.. ప్రతీ ఎపిసోడ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతుందని సమాచారం. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. త్వరలోనే చైతూ ఓటీటీ ఎంట్రీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం చైతూ చేతిలో `లవ్ స్టోరి`, `థాంక్ యూ`, `లాల్ సింగ్ చద్ధా` (హిందీ) చిత్రాలున్నాయి. వీటిలో `లవ్ స్టోరి` విడుదలకు సిద్ధమవగా.. విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తున్న `థాంక్ యూ` ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇక మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో రూపొందుతున్న బాలీవుడ్ మూవీ `లాల్ సింగ్ చద్ధా` కోసం ఆర్మీ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు చైతూ. కాగా, ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే చైతూ వెబ్-సిరీస్ పట్టాలెక్కనుందని టాక్.
మరి.. రానున్న సినిమాలతో, వెబ్ - సిరీస్ తో నాగచైతన్య ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.
Also Read