మిథున్ చక్రవర్తి కొడుకుపై రేప్ కేస్!
on Oct 20, 2020
ముంబై పోలీసులు వెటరన్ యాక్టర్ డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ (మిమో), మిథున్ భార్య యోగితా బాలిలపై రేప్, చీటింగ్ కేసు నమోదు చేశారు. 38 ఏళ్ల ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు గత ఓషివర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ కంప్లయింట్ ప్రకారం మహాక్షయ్‌తో 2015 నుంచి 2018 కాలంలో ఆ మహిళ రిలేషన్షిప్లో ఉన్నదనీ, తనను పెళ్లి చేసుకుంటానని ఆమెకు అతను ప్రామిస్ చేశాడనీ వారు చెప్పారు.
"తాము అనుబంధం ఉన్న కాలంలో మహాక్షయ్ను చూసేందుకు అంధేరి వెస్ట్‌లోని ఆదర్శ్ నగర్లో ఉన్న అతని ఫ్లాట్‌కు వెళ్లానని ఆమె చెప్పారు. అప్పుడతను ఒక స్పైక్డ్ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చి, తనతో శారీరక బంధం పెట్టుకోవడానికి బలవంతం చేశాడని ఆమె ఆరోపించారు" అని పోలీసులు తెలిపారు.
"తను ప్రెగ్నెంట్ అవడంతో, అబార్షన్ చేయించుకొమ్మని మహాక్షయ్ ఆమెపై ఒత్తిడి తెచ్చి, దానికి సంబంధించిన పిల్స్ ఇచ్చాడని ఆమె ఆరోపించారు. తమ పెళ్లి గురించి మహాక్షయ్ను అడిగినట్లు ఆ మహిళ చెప్పారు. 2018 జనవరిలో ఆమెను తాను పెళ్లి చేసుకోలేనని మహాక్షయ్ చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అతనితో మాట్లాడేందుకు ఫోన్ చేయగా, అతని తల్లి యోగితా బాలి తనను బెదిరించినట్లు ఆమె తెలిపారు" అని వారు వెల్లడించారు.
Also Read