రవితేజ మిరపకాయ్ కి పదేళ్ళు
on Jan 13, 2021

మాస్ మహారాజా రవితేజకి కలిసొచ్చే సీజన్స్ లో సంక్రాంతి ఒకటి. పొంగల్ స్పెషల్ గా రీసెంట్ గా రిలీజైన క్రాక్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతోంది. కాగా, ఈ చిత్రాని కంటే ముందు పొంగల్ సీజన్ లో వచ్చిన రవితేజ సినిమాల్లో మిరపకాయ్ ఒకటి. షాక్ వంటి ఫ్లాప్ మూవీ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ కి మరో ఛాన్స్ ఇచ్చి అప్పట్లో వార్తల్లో నిలిచిన రవితేజ.. హరీష్ కి ఈ చిత్రంతోనే తొలి విజయాన్ని అందించారు. ఇందులో రవితేజకి జోడీగా రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ నాయికలుగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, అలీ, రావురమేష్, సుధ నటించగా.. కలర్స్ స్వాతి అతిథి పాత్రలో మెరిశారు.
తమన్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ ఆదరణ పొందాయి. ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై పుప్పాల రమేష్ ఈ యాక్షన్ కామెడీ డ్రామాని నిర్మించారు. 2011 జనవరి 13న జనం ముందుకొచ్చిన మిరపకాయ్.. నేటితో పది వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



