బాలయ్యతో మెహ్రీన్ రొమాన్స్?
on Jun 23, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణకి వీరాభిమానిగా నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా `కృష్ణగాడి వీర ప్రేమగాథ`(2016). బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. `బాలయ్య ఫ్యాక్టర్`తో తొలి విజయం అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఐదేళ్ళ తరువాత ఏకంగా బాలయ్యకి జంటగా నటించే అవకాశం అందిపుచ్చుకుందని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలయ్యకి జోడీగా నటించే అవకాశం మెహ్రీన్ కి దక్కిందని టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ఆగస్టులో సెట్స్ పైకి వెళ్ళనున్న బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేయనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. మెహ్రీన్ ప్రస్తుతం హిలేరియస్ ఎంటర్టైనర్ `ఎఫ్ 3`లో నటిస్తోంది. అలాగే సంతోష్ శోభన్ కి జంటగా ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలోనూ సందడి చేయనుంది.
Also Read