ప్రకాష్ రాజ్ ని 'మా' అధ్యక్షుడిగా ఒప్పుకోం: కళ్యాణి
on Jun 23, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు బరిలో నిలవనున్నట్లు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ ని మా అధ్యక్షుడిగా ఒప్పుకోం అని, ఆయనకు సపోర్ట్ చేసేది లేదని సినీ నటి, మా సభ్యురాలు కరాటే కళ్యాణి అంటున్నారు. పొరుగు భాష నుంచి వచ్చి ఇక్కడ ఆయన అధ్యక్షుడు ఎలా అవుతారు? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
"ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు. తెలుగు వాళ్లకి దగ్గరైన వ్యక్తి. ఒక ఆర్టిస్ట్ గా ఆయన్ని నెత్తిమీద పెట్టుకుంటాం. కానీ అధ్యక్ష పదవికి ఒప్పుకోలేం. తెలుగు వారే మా అధ్యక్షులు కావాలనేది నా అభిప్రాయం" అని కళ్యాణి అన్నారు. తమిళ్, కన్నడ ఇండస్ట్రీవాళ్లు తెలుగు వారికి కనీసం వేషాలు కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తుంటే.. వాళ్లని తీసుకుని వచ్చి ఇక్కడ అధ్యక్షుల్ని ఎలా చేస్తాం అని కళ్యాణి నిలదీశారు.
నడిగర్ సంఘంలో అయితే మనం పోటీ చేయగలమా? ఖచ్చితంగా చేయలేం. అలాంటప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఎలా పోటీ చేస్తారని కళ్యాణి ప్రశ్నించారు. బాగా పాలిస్తున్నారు కదా అని స్టాలిన్ ని తీసుకుని వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని చేయలేం కదా?. మనకు జగన్, కేసీఆర్ ఉన్నారు. స్టాలిన్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే ఒప్పుకోం అన్నారు.
Also Read