`రా` ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్
on Apr 21, 2021
గత ఏడాది సంక్రాంతికి `ఎంత మంచివాడవురా` చిత్రంతో పలకరించారు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో.. తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారాయన.
ఈ నేపథ్యంలోనే.. రీసెంట్ గా హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. నూతన దర్శకుడు రాజేంద్ర ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ కూడా పూర్తయిందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్.. `రా` ఆఫీసర్ గా నటిస్తున్నారని వినికిడి. అంతేకాదు.. తన బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా ఇందులో కొత్తగా ఉంటాయని బజ్. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఈ ఏడాది చివరలో కళ్యాణ్ రామ్ - మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.