మాల్దీవుల్లో జ్వాల, విష్ణు షికారు!
on Feb 26, 2021
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, తమిళ స్టార్ యాక్టర్ విష్ణు విశాల్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఆ ఇద్దరూ మాల్దీవులకు వెళ్లి ఎంజయ్ చేసిన ఫొటోలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. 2009లో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు స్వల్పకాలంలోనే ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిట్టిచ్చిన 'రాక్షసుడు' ఒరిజినల్ 'రాచ్చసన్'లో హీరో విష్ణు విశాలే. 2010లో తన గాళ్ ఫ్రెండ్ రజని నటరాజ్‌ను పెళ్లాడిన అతను 2018లో విడాకులిచ్చాడు.
మరోవైపు తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడిన జ్వాల.. అతడిని 2005లో వివాహం చేసుకుంది. వారి దాంపత్యం ఆరేళ్ల పాటే సాగింది. 2011లో వారు డైవోర్స్ తీసుకున్నారు.
రెండేళ్ల క్రితం విష్ణు, జ్వాల మధ్య జరిగిన పరిచయం ప్రణయానికి దారితీసింది. 2020 న్యూ ఇయర్ సాక్షిగా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమ మధ్య ప్రేమను ఆ ఇద్దరూ బహిర్గతం చేశారు. గత సెప్టెంబర్‌లో వారి నిశ్చితార్ధం కూడా జరిగింది.
సందర్భం వచ్చిన ప్రతిసారీ తాము సరదాగా గడిపిన క్షణాలకు చెందిన ఫొటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. అదే విధంగా ఇటీవల మాల్దీవులకు తమ కుటుంబాలతో తరలి వెళ్లిన జ్వాల, విష్ణు అక్కడ ఆనందంగా విలువైన సమయాన్ని గడిపారు.
తమ ఫొటోలతో పాటు, ఫ్యామిలీస్‌తో దిగిన పిక్చర్స్‌ను కూడా షేర్ చేశారు. వాటిలో జ్వాల బికినీ ధరించి పడుకొని ఉన్న పిక్చర్ కూడా ఉంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read