`అఖండ`.. జగ్గూభాయ్ రోల్ అదేనా?
on Aug 5, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ `లెజెండ్` (2014)తో విలన్ గా టర్న్ అయ్యాడు సీనియర్ హీరో జగపతి బాబు. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. కట్ చేస్తే.. ఏడేళ్ళ అనంతరం మళ్ళీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న `అఖండ`లో నటిస్తున్నాడు జగ్గూభాయ్. అయితే, ఈ సారి నెగటివ్ రోల్ లో కాకుండా పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట ఈ వెర్సటైల్ యాక్టర్.
ఆ వివరాల్లోకి వెళితే.. `అఖండ`లో కలెక్టర్ గా, అఘోరాగా రెండు విభిన్న వేషాల్లో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, బాలయ్య పోషిస్తున్న ఆ అఘోరా పాత్రకి స్ఫూర్తినిచ్చే మరో అఘోరాగా జగపతిబాబు దర్శనమివ్వబోతున్నాడట. పాత్ర నిడివి తక్కువే అయినా చాలా శక్తిమంతమైన వేషమని అని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `అఖండ` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 10కి ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని వినికిడి. ఇందులో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు. అక్టోబర్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుందని టాక్.
Also Read