ఇంటిలిజెంట్ కెరీర్‌కి కామానా, ఫుల్‌స్టాపా..?
on Feb 10, 2018

పుష్ఫక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ఛాన్స్ ఉంటుంది అన్నట్లు ఎంతమంది హీరోలు వచ్చినా.. మెగా ఫ్యామిలీలో మరొకరికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే అరడజను మందికి పైగా ఈ కుటుంబం నుంచి టాలీవుడ్‌కు రిప్రెజెంట్ చేస్తున్నారు. చిరంజీవి తొలి రోజుల్లో ఎలా ఉండేవాడో అచ్చుగుద్దినట్లు అదే ఫేస్‌కట్‌తో తెలుగుతెర మీదకి దూసుకువచ్చాడు సాయిథరమ్ తేజ్. సాలీడ్ హిట్లు కొట్టకపోయినప్పటికీ.. మినిమిమ్ గ్యారెంటీ సక్సెస్‌లతో షార్ట్ పీరియడ్‌లోనే మంచి పాపులారిటీ సంపాదించాడు. పిల్లా నువ్వు లేని జీవితం కుర్రాడిలో విషయం ఉందని తెలియగా... సుబ్రమణ్యం ఫర్ సేల్ అతన్ని హీరోగా నిలబెట్టింది. ఇక మూడో సినిమా సుప్రీంకే సుప్రీం హీరో అన్న స్క్రీన్ నేమ్ సంపాదించేశాడు. ఇంత నేమ్ ఫేమ్ వచ్చాకా సహజంగానే తర్వాతి సినిమాపై అంచనాలుంటాయి. తిక్కతో లెక్క తేలుస్తాడు అనుకుంటే సినిమా చూసిన వాళ్లకి తిక్కలేచింది. విన్నర్‌గా నిలుస్తాడు అంటే లూజర్‌గా మిగిలాడు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన జవాన్ ఎక్స్‌పెరిమెంట్‌గా మిగిలింది తప్ప టార్గెట్ రీచవ్వలేదు. ఇలాగే పోతే పోటీలో వెనకపడిపోతాం అనుకున్న టైంలో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్‌ని నమ్మి ఇంటిలిజెంట్‌గా వచ్చాడు సాయి. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ మూవీ పేరుకే ఇంటిలిజెంట్ తప్ప విషయం లేదని మార్నింగ్ షోకే పెదవి విరుపులు మొదలయ్యాయి. మాస్ కమర్షియల్ కథలకు కాలం చెల్లిందని తెలిసినా.. కెరీర్ డైలామాలో ఉందని కళ్లెదురుగా కనిపిస్తున్నా.. తేజూ ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడా అని మెగాభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనోడి చేతిలో సినిమాలు ఏం లేవు.. వెంటనే ముఖానికి రంగేసుకునే మూడ్ కూడా లేదు. మరి తన భవిష్యత్ గురించి ఈ మెగా హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని ఫిలింనగర్‌లో ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



