"హ్యాపీ టెన్త్ యానివర్సరీ క్యూటీ".. భార్యకు బన్నీ విషెస్!
on Mar 6, 2021
భార్య స్నేహారెడ్డికి తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన దీన్ని ఓ అద్భుత ప్రయాణంగా అభివర్ణించాడు. మరెన్నో ఏళ్లు ఈ జర్నీ కొనసాగాలని ఆకాంక్షించాడు.
అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి నేడు (మార్చి 6) పదో పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డే సందర్భంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా రెండు స్టన్నింగ్ పిక్చర్స్ షేర్ చేసి, స్నేహకు విషెస్ తెలిపాడు బన్నీ. ఒక ఫొటో తాజ్ మహల్ ముందు నిల్చొని తీయించుకున్నది కాగా, మరొకటి వారి పెళ్లి నాటిది. 2011 మార్చి 6న వైభవంగా జరిగిన వేడుకలో స్నేహ మెడలో మూడు ముళ్లు వేశాడు బన్నీ.
భార్య స్నేహ, పిల్లలతో కలిసి ఈరోజు తన ఇంట్లో పదో పెళ్లిరోజును బన్నీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో రెండు బ్యూటిపుల్ పిక్చర్స్ను షేర్ చేశాడు. సోషల్ మీడియాలో, "మనకు పదో పెళ్లిరోజు శుభాకాంక్షలు క్యూటీ. పదేళ్ల ఎలాంటి అద్భుత ప్రయాణం!.. ఇంకా ఇలాంటివి మరెన్నో రాబోతున్నాయి" అని రాసి, ఓ హార్ట్ ఎమోజీ జోడించాడు.
ఒక ఫ్రెండ్ పార్టీలో స్నేహా రెడ్డిని చూసిన తొలి చూపులోనే మనసిచ్చేశాడు బన్నీ. ఆయన పాపులారిటీ కారణంగా అల్లు అర్జున్ పేరు ఆమెకు తెలుసు కానీ అంతదాకా ఆయన సినిమాలను ఆమె చూడలేదు. తన ఫ్రెండ్ నుంచి స్నేహ నంబర్ తీసుకున్న బన్నీ ఆమెకు మెసేజ్లు చేయడం మొదలుపెట్టాడు.
అల్లు అర్జున్, స్నేహ కొంత కాలం ఫోన్లలో మాట్లాడుకొని మళ్ళీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పరం క్రమం తప్పకుండా కలవాలని నిర్ణయించుకోవడానికి ఆ మీటింగ్ సరిపోయింది.
మొదట బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ వారి ప్రేమను అంగీకరించలేదు. కానీ ప్రేమికులిద్దరూ తమ పెద్దల అంగీకారం లభించేంత వరకూ తమ ప్రేమపై గట్టిగా నిలబడ్డారు. ఎట్టకేలకు 2010 నవంబర్ 26న ఇరువురి కుటుంబాల పెద్దలూ వారి నిశ్చితార్ధం జరిపారు. ఆ తర్వాత 2011 మార్చి 11 గ్రాండ్గా జరిగింది వారి వివాహ వేడుక.
అల్లు అర్జున్, స్నేహ దంపతులకు ఇద్దరు పిల్లలు - కొడుకు అయాన్, కూతురు అర్హ.