'గాడ్ ఫాదర్' కలెక్షన్స్.. రెండో రోజు సీన్ రివర్స్!
on Oct 7, 2022
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ దగ్గర స్టడీగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.17.68 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండు రోజు రూ.9.67 కోట్ల షేర్ వసూలు చేసింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.70.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'గాడ్ ఫాదర్' మొదటి రోజు రూ.12.97 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా రెండో రోజు రూ.7.73 షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.5.67 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.5.14 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.9.89 కోట్ల షేర్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.20.70 కోట్ల షేర్ సాధించింది. అలాగే కర్ణాటకలో 2.30 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా 1.80 కోటి షేర్, ఓవర్సీస్ లో 2.55 కోట్ల షేర్ కలిపి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 27.35 కోట్ల షేర్(50.35 కోట్ల గ్రాస్) రాబట్టింది.
హైర్స్, థియేటర్ల సంఖ్య తదితర కారణాల వల్ల చిరంజీవి గత చిత్రం 'ఆచార్య'తో పోలిస్తే 'గాడ్ ఫాదర్'కి మొదటిరోజు తక్కువ వసూళ్లే వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 'ఆచార్య' రూ.35.05 కోట్ల షేర్ రాబట్టగా, 'గాడ్ ఫాదర్' రూ.17.68 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. అయితే 'ఆచార్య' డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, 'గాడ్ ఫాదర్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజు కలెక్షన్లు తారుమారయ్యాయి. ఆచార్య రెండో రోజు రూ.6.02 కోట్ల షేర్ రాబట్టగా, 'గాడ్ ఫాదర్' రూ.9.67 కోట్ల షేర్ తో సత్తా చాటింది.
దసరా సెలవులు, పైగా వీకెండ్ కావడంతో 'గాడ్ ఫాదర్' ఈ మూడు రోజుల్లో మరో రూ.25-30 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశముంది. అయితే వరల్డ్ వైడ్ గా రూ.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే బాగా పుంజుకోవాల్సి ఉంది. ఈ ఆదివారం నాటికి రూ.50 కోట్లకి పైగా షేర్ రాబట్టే ఛాన్స్ ఉంది. కానీ 'గాడ్ ఫాదర్' ముందున్న భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి అది సరిపోదు. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లకు గండికొట్టే సినిమాలు లేకపోవడం 'గాడ్ ఫాదర్'కి కలిసొచ్చే అంశం. మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో కలెక్షన్లలో ఇదే స్టడీ కొనసాగించి మెగాస్టార్ కి హిట్ అందిస్తుందేమో చూడాలి.
Also Read