స్ట్రెస్ నుంచి బయటపడేసే టానిక్.. సాటిలేని 'ఫన్ బకెట్'!
on Mar 4, 2021
'ఫన్ బకెట్' ఒక బ్రాండ్.. తెలుగు యూట్యూబ్ చానళ్లకు పయనీర్ అయిన తెలుగువన్‌లో అర్ధ దశాబ్దం పై నుంచీ వ్యూయర్స్‌ను అలరిస్తూ వస్తోన్న నవ్వుల టానిక్! టీవీ చానళ్లలో ఎన్ని కామెడీ షోలు వచ్చినా, వస్తున్నా వాటన్నింటికీ పయనీర్ అయిన ఫన్ బకెట్ ఫన్ బకెట్టే! వారానికి ఒకటి చొప్పున ఇప్పటికి 278 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న బ్లాక్‌బస్టర్ కామెడీ సిరీస్ మొత్త రన్ టైమ్ కలిపితే 40 గంటలు దాటింది. అంటే నాన్‌స్టాప్‌గా దాదాపు రెండు రోజుల పాటు చూడొచ్చన్న మాట!
మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి నుంచి బయటపడడానికి ఎలాంటి మెడిసిన్ తీసుకోకపోయినా హాయిగా నవ్వగలిగితే అదే మంచి మెడిసిన్ అని ఎన్నడో నిరూపితమైంది. డాక్టర్లు సైతం అదే చెబుతుంటారు. అందుకే తెలుగు ప్రజానీకాన్ని ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రశాంతమైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో 2015లో తెలుగువన్ ప్రారంభించిన నాన్‌స్టాప్ కామెడీ సిరీస్ 'ఫన్ బకెట్'. పొట్టచక్కలయ్యేలా నవ్వించే ఆరోగ్యకరమైన కామెడీతో, ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా 278 ఎపిసోడ్లుగా హాయిగా నవ్విస్తూ, ఆరోగ్యాన్ని అందిస్తుండటం 'ఫన్ బకెట్'కే సాధ్యం.
ఇప్పటివరకూ 200 మిలియన్ల మందికి పైగా ఫన్ బకెట్‌ను వీక్షించారంటే ఈ సిరీస్ ఎంతటి బ్లాక్‌బస్టరో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్‌లో నటించిన పలువురు వర్థమాన కమెడియన్లు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకొని రాణిస్తూ ఉండటం మరో విశేషం. ఫ్యామిలీ లైఫ్‌లోని వివిధ ఘట్టాలు, అంశాలతో పాటు సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను కూడా హైలైట్ చేస్తూ స్కిట్స్ రూపొందిస్తుండటం 'ఫన్ బకెట్' విజయ రహస్యం.