ప్రభాస్ చిత్రంలో బ్రహ్మానందం కితకితలు
on Jul 26, 2021
రీసెంట్ గా బ్లాక్ బస్టర్ మూవీ `జాతిరత్నాలు`లో స్పెషల్ రోల్ లో కనిపించి.. తన శైలి వినోదాలతో అలరించారు కామెడీకింగ్ బ్రహ్మానందం. కట్ చేస్తే.. త్వరలో ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ కోసం చాన్నాళ్ళ తరువాత పూర్తిస్థాయి పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నారట ఈ స్టార్ కమెడీయన్. అది కూడా ఓ పాన్ - ఇండియా మూవీ కోసం..
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కే` పేరుతో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. గురుపూర్ణిమ సందర్భంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ని కూడా షురూ చేశారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ మాగ్నమ్ ఓపస్ లో నవ్వులు పండించే ఓ హిలేరియస్ రోల్ ఉందట. అందులో బ్రహ్మానందంని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట నాగ్ అశ్విన్. అంతేకాదు.. ప్రభాస్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే `ప్రాజెక్ట్ కే`లో బ్రహ్మి ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మరి.. తొలిసారిగా పాన్ - ఇండియా వెంచర్ లో కనిపించనున్న బ్రహ్మానందం.. ఎలాంటి పాత్రలో మెస్మరైజ్ చేయబోతున్నారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read