నాకు స్టార్డమ్ పెద్దగా ఇష్టం ఉండదు...విజయసాయి మరణంతో షాకయ్యా!
on Nov 30, 2022
అవసరాల శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అతనొక యాక్టర్, డైరెక్టర్, రైటర్,‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో డైరెక్టర్ గా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఆ సినిమా తర్వాత ‘జ్యో అచ్యుతానంద’ అనే రొమాంటిక్ కామెడీ మూవీని కూడా తీశారు. తీసినవి, చేసినవి కొన్ని మూవీస్ ఐనా కూడా ఆయనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంది. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు శ్రీనివాస్ " నాకు పెద్దగా స్టార్డం అనేది ఇష్టం ఉండదు. ఇక ఆ స్టార్డంని మోయాలి అంటే నా వల్ల కాదు. నాకు పెద్ద పెద్ద వాళ్ళతో అంత రేపో లేదు. కానీ నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నాని, అల్లరి నరేష్, ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి వాళ్ళతో నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. చింతకాయల రవి మూవీకి ఘోస్ట్ రైటర్ గా ఉన్నాను. కానీ నేను రాసిన స్క్రిప్ట్ ఆ మూవీ డైరెక్టర్ కి సరిగా చేరలేదు. నేను కూడా ఆ టైములో అక్కడ లేను .. యూస్ లో ఉన్నా. అలా ఆ మూవీలో కొన్ని గుర్తున్న బిట్స్ మాత్రమే చెప్పడంతో ..వాటిని మూవీలో వాడారు నేను ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అష్టాచెమ్మా తర్వాత చాలా కథలు వచ్చాయి కానీ ఒకే మూసలో వెళ్లిపోతున్నాయి అనిపించింది.
ఇక మిత్రుడు విజయ్ సాయి మరణం నిజంగా నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఐతే అతనికి ఫైనాన్సియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయన్న విషయం తర్వాత తెలిసింది. సినిమా ప్రపంచం అంటే పైకి కనిపించినంత అందంగా ఉండవు ఎవరి జీవితాలు" అని చెప్పారు శ్రీనివాస్.