సామ్‌తో అనిల్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్?
on May 7, 2021
`పటాస్` (2015)తో దర్శకుడిగా తొలి అడుగేసిన అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు ఐదు చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `ఎఫ్ 3` అనిల్ ఆరో చిత్రం. త్వరలో నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజతో అనిల్ తన తదుపరి చిత్రాలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు హీరో సెంట్రిక్ మూవీస్ నే చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి.. త్వరలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నారట. అది కూడా.. స్టార్ హీరోయిన్ అక్కినేని సమంతతో. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్ళ క్రితం అనిల్ ఓ ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నారు. ఆ సబ్జెక్ట్ నే రీసెంట్ గా సామ్ కి వినిపించారట. కథ నచ్చడంతో సమంత కూడా వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందని టాక్. ప్రస్తుతం సామ్.. వెటరన్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తున్న `శాకుంతలం`లో టైటిల్ రోల్ లో నటిస్తోంది. అది పూర్తయ్యాకే.. అనిల్ కాంబో మూవీ చేసే అవకాశముందని వినికిడి. ఈలోగా.. అనిల్ కూడా తన కమిట్ మెంట్స్ ని పూర్తిచేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
మరి.. అనిల్ రావిపూడి చేయనున్న ఈ ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.