`ఎఫ్ 2` రీమేక్‌లో అనిల్ కపూర్?
on Apr 6, 2021
2019 సంక్రాంతి సీజన్ లో సంచలన విజయం సాధించిన చిత్రం `ఎఫ్ 2`. ఆ సినిమాలో తోడల్లుళ్ళుగా విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పండించిన వినోదం.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా `ఎఫ్ 3` రూపొందుతోంది. మరోవైపు.. `ఎఫ్ 2`ని హిందీనాట రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒరిజినల్ వెర్షన్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తో కలిసి ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీ ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్నారు. కాగా, మాతృకలో వరుణ్ తేజ్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ నటించబోతున్నాడని ఇప్పటికే కొన్ని కథనాలు వచ్చాయి. అలాగే సీనియర్ హీరో అనిల్ కపూర్ కూడా `ఎఫ్ 2` రీమేక్ లో సందడి చేయనున్నారని టాక్. అయితే తను పోషించేది వెంకీ రోల్ నా లేదంటే రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ నా లేక అతిథి పాత్రనా అన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. త్వరలోనే `ఎఫ్ 2` రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.